Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడుగు బయటకు పెట్టేముందే అమ్మాయిలు ఆలోచించుకోవాలి: హీరోయిన్ ఇంద్రజ

  • అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ఉండాలి
  • ముందు ఆలోచన చేసే ముందడుగు వేయాలి
  • ఎవరి లిమిట్స్ వాళ్లను కాపాడతాయి
తెలుగు తెరపై నిన్నటితరం కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. "ఒక్క చిత్రపరిశ్రమలోనే కాదు .. ప్రతి రంగంలోనూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వుంది. ఇంట్లో నుంచి అడుగు బయటకి పెడుతున్నప్పుడే ఆలోచించుకోవాలి.

మనం ఎక్కడికి వెళుతున్నాము? ఎవరిని కలుస్తున్నాము? అక్కడ మనల్ని కలిసేవారికి ఎంత దూరంలో గీత గీయాలి? మనం వెళ్లిన పని కానప్పుడు ఏం చేయాలి? ఇలా అమ్మాయిలు తమను గురించిన ఆలోచన చేయాలి. అవకాశం రాకపోతే పోయింది .. నేను ఇలాగే  వుంటాను అనే ఆత్మ స్థైర్యం కావాలి. మన లిమిట్స్ మనని రక్షిస్తూ వుంటాయన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఆ తరువాత బాధపడవలసిన అవసరం ఉండదు" అని చెప్పుకొచ్చారు. 
indraja

More Telugu News